Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వలసదారుల్లో భారతీయులదే అగ్రస్థానం!

Advertiesment
Indians
, శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:47 IST)
ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్తున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. తాజాగా విడుదల చేసిన 'ఇంటర్నేషనల్‌ మైగ్రాంట్‌ స్టాక్‌-2019' నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది ఐరాస 2019లో విదేశాలకు వలస వెళ్తున్న వారిలో భారతీయులే ముందంజలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ఈ మేరకు తాజాగా 'ఇంటర్నేషనల్‌ మైగ్రాంట్‌ స్టాక్‌-2019' నివేదికను విడుదల చేసింది. ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం తయారుచేసిన ఈ నివేదికలో.. ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళ్లిన వారి సంఖ్య 272 మిలియన్లకు చేరిందని వెల్లడైంది.

అన్ని దేశాల్లో ఉన్న ప్రజల వయసు, ప్రాంతం తదితర అంశాల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేశారు. మన దేశానికి వచ్చింది తక్కువే.. అంతర్జాతీయంగా వలస వెళ్లిన వారిలో మూడో వంతు ప్రజలు పది దేశాలకు చెందినవారే ఉండటం గమనార్హం. 2019లో ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన 1.75 కోట్ల మంది విదేశాలకు వెళ్లారు.

ఈ జాబితాలో భారత్‌ మొదటి వరుసలో ఉంది. తర్వాతి స్థానాల్లో 1.18 కోట్ల మందితో మెక్సికో, 1.07 కోట్ల మందితో చైనా ఉన్నాయి. రష్యా, సిరియా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, అఫ్గానిస్థాన్‌ టాప్‌ 10 స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ 2019లో 51 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయమిచ్చింది. ఇందులో 48.8శాతం మంది మహిళలే ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాజ్‌భవన్‌ సిబ్బంది కోసం గవర్నర్‌ ఏం చేశారో తెలుసా?