Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Advertiesment
rail one app

ఠాగూర్

, బుధవారం, 2 జులై 2025 (08:17 IST)
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు వివిధ రకాలైన సేవల కోసం వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరాన్ని తొలగిస్తూ, అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. రైల్ వన్ యాప్ పేరుతో సరికొత్త ఆన్ ఇన్ వన్ సూపర్ యాప్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యాప్‌ను ప్రయాణికులకు అంకితం చేశారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా, రైలు ప్రయాణ టిక్కెట్లు జారీచేసే కౌంటర్ల వద్ద క్యూ లైన్ల సమస్యకు ముగింపు పలకవచ్చని రైల్వే శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. 
 
రైల్ వన్ యాప్‌ ప్రయాణికులకు సమగ్రమైన సేవలను అదిస్తుంది. ముఖ్యంగా, కౌంటర్ల వద్ద మాత్రమే లభించే అన్‌రిజర్వుడ్ టిక్కెట్లను ఇపుడు ఈ యాప్ ద్వారా సులుపుగా బుక్ చేసుకోవచ్చు. గతంలో ఉన్న యూటీఎస్‌ యూప్‌ను మరింత సరళీకరించి, ఈ కొత్త యాప్‌లో అనుసంధానించారు. దీంతో పాటు ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఐఆర్‌సీటీసీ ద్వారా జరిగే రిజర్వుడ్ టిక్కెట్ల బుకింగ్ యథాతథంగా కొనసాగుతుందని, క్రిస్, ఐఆర్‌సీటీసీ భాగస్వాములుగా పని చేస్తాయని మంత్రి స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్