Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Advertiesment
Venkateswara Rao, Satish Kumar, Vijay Bolla, Akshay, Madan, KL Damodar Prasad

దేవీ

, మంగళవారం, 1 జులై 2025 (14:33 IST)
Venkateswara Rao, Satish Kumar, Vijay Bolla, Akshay, Madan, KL Damodar Prasad
వెంకటేశ్వర రావు నిర్మాతగా సతీష్ కుమార్ రచనా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం బ్లాక్ నైట్. ఈ చిత్రానికి మధు కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా విజయ్ బొల్లా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో అక్షయ్, మదన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో దైవానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మరోసారి వింటేజ్ రోజుల తరహా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ తరానికి తగ్గట్లు మరోసారి అటువంటి సినిమాలను తీసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు. 
 
రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ,  ఇటీవల కాలంలో ఇటువంటి దైవాత్మక సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. చిత్ర సాంగ్స్, టైలర్ ఎంతో బాగున్నాయి. చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చే వారిని మనం ప్రోత్సహించి అండగా నిలబడాలి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. 
 
సంగీత దర్శకుడు విజయ్ బొల్లా మాట్లాడుతూ, ఎంతో ఛాలెంజింగ్ తీసుకొని ఈ చిత్రానికి సంగీతం అందించా. సాధారణంగా ఇటువంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ సినిమా కోసం మా దర్శకుడు నా వెంట ఉండి చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాలుగు పాటలు రాసి అందించిన మా నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అన్నారు. 
 
నటుడు ఆకాష్ మాట్లాడుతూ,  ఈ సినిమాకు విజయ్ బొల్లా గారి సంగీతం ఎంతో బలాన్ని చేకూర్చింది. ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. 
 
నటుడు మదన్ మాట్లాడుతూ, కొత్త వారంతా ఓ చిన్న సినిమా తీసి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది ఎంతో గొప్ప విషయం. చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు డైరెక్టర్ పై ఎంత నమ్మకం ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చింది. సినిమాని పెద్ద విజయం సాధించేందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను" అన్నారు. 
 
చిత్ర నిర్మాత వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, ఈ సినిమా అంతా రియల్ లొకేషన్ లో షూటింగ్ చేయడం జరిగింది. అలాగే యువత కోసం  ఈ సినిమాలో మంచి పబ్ సాంగ్ పెట్టడం జరిగింది. ఈ సినిమాని అందరూ అభిమానించి మంచి విజయాన్ని అందజేస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ