Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

Advertiesment
Kaliyugam 2064- Shraddha Srinath

దేవీ

, శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (15:55 IST)
Kaliyugam 2064- Shraddha Srinath
'జెర్సీ, 'డాకు మహారాజ్' వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్సన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ 'కలియుగమ్ 2064'. కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని 'ఆర్.కె.ఇంటర్నేషనల్' సంస్థపై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు.

webdunia
Kaliyugam 2064.. team with Ram Gopal Varma
ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మే 9న తమిళ,తెలుగు భాషల్లో ఏకకాలంలో సమ్మర్ కానుకగా విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ అయిన 'మైత్రి డిస్ట్రిబ్యూషన్' సంస్థ విడుదల చేస్తుంది.
 
ఇప్పటికే మణిరత్నం లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేషాదరణ లభించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ట్రైలర్ ను సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆవిష్కరించారు.
 
అనంతరం రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. "ఇప్పుడే 'కలియుగమ్ 2064' ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆబ్సోల్యూట్లీ ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్  కలిగింది. ఫోటోగ్రఫి, క్యారెక్టర్స్ డిజైన్. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్.. ఇలా అన్నీ ఒక మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి. మే 9న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. ఈ సందర్భంగా చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ చెబుతున్నాను" అంటూ తెలిపారు.
 
ఇక 'కలియుగమ్ 2064' ట్రైలర్ విషయానికి వస్తే భవిష్యత్తులో ముఖ్యంగా 2064 లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు. ఆహారం, నీరు, మానవత్వం అనేవి కరువైనప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు? అనే థీమ్ తో కలియుగంలోని పౌరాణిక ఇతివృత్తాలను గుర్తుచేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే విధంగా ఉన్నాయి.ముఖ్యంగా పి.సి.శ్రీరామ్ శిష్యుడు కె.రాంచరణ్ అందించిన సినిమాటోగ్రాఫి టాప్ నాచ్ లో ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
 
నటీనటులు: శ్రద్ధా శ్రీనాధ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ తదితరులు
సాంకేతిక నిపుణులు: నిర్మాత :కె. యస్. రామకృష్ణ,  రచన & దర్శకత్వం :ప్రమోద్ సుందర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ :కె. రామ్ చరణ్, సంగీత దర్శకుడు :డాన్ విన్సెంట్, పీఆర్ఓ : ఫణి కుమార్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ