Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడుము బెల్టులో దాచి 16 కేజీల బంగారం స్మగ్లింగ్

Advertiesment
gold
, శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:57 IST)
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు నుంచి 8.40 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు పెట్టుకున్న నడుము బెల్టులో 16 కేజీల బంగారాన్ని దాచిపెట్టి అగ్రమంగా తరలిస్తుండగా ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో సీటు కింద పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఈ వెండిని అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాడిస్ట్ ఆలోచనలు... రోడ్డు కమ్ రైల్వే వంతెన వారం రోజుల పాటు మూసివేత