Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

Advertiesment
India vs Pakistan

ఠాగూర్

, సోమవారం, 19 మే 2025 (09:07 IST)
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‍‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో సుమారు 100 మందికిపైగా చనిపోయారు. దీంతో దిక్కుతోచని పాకిస్థాన్.. భారత ఆర్మీ స్థావరాలు, జనవాసాలే లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులకు తెగబడింది. వీటిని భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఎస్ 400, అశోక్ తదితర భారత గగనతల రక్షణ వ్యవస్థు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి. 
 
వాటిని ఎక్కడికక్కడే కూల్చివేశాయి. దీంతో పాక్ డ్రోన్లు, మిస్సైళ్ల శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీటికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పాక్‍‌పై జరిపిన పలు దాడుల వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది. తాజాగా పాక్ మిస్సైల్స్‌ను ఎలా కూల్చారో తెలిసేలా వెస్ట్రన్ కమాండ్ ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అగ్ని గోడలా భారత ఆర్మీ శత్రుదేశపు మిస్సైళ్లను నేలమట్టం చేయడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్యోతి అలాంటిదని తెలియదు... పాకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లాను.. : ప్రియాంక సేనాపతి