Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమారస్వామి కంటతడి-బీజేపీ సెటైర్లు.. కాంగ్రెస్ ఓదార్పు.. ఎలా?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిపై బీజేపీ సెటైర్లు విసిరింది. జేడీఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం సందర్భంగా కుమారస్వామి భావోద్వేగానికి గురైయ్యారు. సోదరుడినైన తాను సీఎం అయ్యానని మీరంతా సంతోషపడుతున్నారని..

Advertiesment
కుమారస్వామి కంటతడి-బీజేపీ సెటైర్లు.. కాంగ్రెస్ ఓదార్పు.. ఎలా?
, సోమవారం, 16 జులై 2018 (14:04 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిపై బీజేపీ సెటైర్లు విసిరింది. జేడీఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం సందర్భంగా కుమారస్వామి భావోద్వేగానికి గురైయ్యారు. సోదరుడినైన తాను సీఎం అయ్యానని మీరంతా సంతోషపడుతున్నారని.. కానీ తాను మాత్రం సంతోషంగా లేనని చెప్పారు. 
 
లోకాన్ని కాపాడటం కోసం పరమశివుడు తన గొంతులో గరళాన్ని నింపుకున్నట్టు... తాను కూడా విషం తాగుతున్నానని కంటతడి పెట్టారు. దీనిపై కర్ణాటక బీజేపీ సెటైర్లు విసిరింది. 'అండ్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు' అంటూ ట్విట్టర్లో శీర్షిక పెట్టి.. దిగ్గజ నటుడు కుమార స్వామి తన నటనా చాతుర్యంతో ప్రజలను నిత్యం ఫూల్స్ చేస్తున్నారని ట్వీట్ చేసింది.
 
మరోవైపు కన్నడనాట సంకీర్ణ ప్రభుత్వాన్ని తాను ఎంతో కష్టంతో నడుపుతూ ఉన్నానని, తనకిప్పుడు విషం మింగుతున్నట్టు ఉందని కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓదార్పు వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కుమారస్వామి ధైర్యంగా ఉండాలని, సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు. 
 
సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఎప్పుడూ కష్టమే. ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఎదురవుతుంది. సమస్యను సెక్యులర్ పార్టీలకు మద్దతిస్తున్న ప్రజల ముందు పెట్టడం మంచి పద్ధతి కాదని, అది తప్పుడు సంకేతాలను పంపిస్తుంది. ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొనేందుకు కుమారస్వామి ధైర్యంగా ఉండాలి. ప్రజల కోరికలను నెరవేర్చాలని ఖర్గే సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకరితో తాళి.. మరొకరితో ప్రేమ.. ఇంకో వ్యక్తితో జంప్.. ఎక్కడ?