స్పైస్ జెట్ విమాన పైలెట్లు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారు. భద్రతా నియమాలను ఉల్లంఘించి విమానం కాక్‌పిట్‌లో హోళీ పండుగను సెలెబ్రేట్ చేసుకున్నారు. దేశం యావత్ ఈ హోళీ పండుగలో నిమగ్నమైవున్న వేళ ఇద్దరు పైలెట్లు మాత్రం విమానం కాక్‌పిట్‌లో ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్పైస్ జెట్ విమానం విచారణకు ఆదేశించింది.
హోలీ రోజున స్పైస్‌జెట్‌కు చెందిన ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లో స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌ని ఎంజాయ్ చేశారు. దేశమంతా వేడుకల్లో మునిగిపోయిన సమయంలో వారు ఇలా వ్యవహరించారు. ఢిల్లీ నుంచి గౌహతికి వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల భద్రతను ఫణంగా పెట్టి, ఇలా నిబంధనలు ఉల్లంఘించడాన్ని స్పైస్‌జెట్ తీవ్రంగా పరిగణించింది.
'ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పైలట్లపై విచారణ ప్రారంభించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాక్‌పిట్‌లో ఆహారం తీసుకునే విషయంలో కఠిన నియమావళి ఉంది' అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.