Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిపిన్ రావత్ చివరిగా నీళ్లు కావాలని అడిగారు.. ప్రత్యక్ష సాక్షి శివకుమార్

బిపిన్ రావత్ చివరిగా నీళ్లు కావాలని అడిగారు.. ప్రత్యక్ష సాక్షి శివకుమార్
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:45 IST)
Shiv Kumar
తమిళనాడులో చోటుచేసుకున్నఘోర హెలికాప్టర్ ప్రమాదంతో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణితో పాటు మరో 11 మంది దుర్మరణం పాలయ్యారు. నీలగిరి కొండల్లోని కూనూర్ వద్ద సంభవించిన ఈ ప్రమాదంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఒళ్లు జలదరించే విషయాలను వెల్లడిస్తున్నారు.
 
హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందన్నారు. 
 
బిపిన్ రావత్ స్థితిని తలచుకుంటే బాధనిపిస్తోందని.. ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదని ప్రత్యక్ష సాక్షి శివకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్‌ స్థానిక కాంట్రాక్టరు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ రావత్‌ దంపతులు సహా 13 మందిని బలిగొన్న హెలికాప్టర్‌ ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. 
 
ఇంకా శివకుమార్ మాట్లాడుతూ.. దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి చివరకు నీళ్లు కావాలని మమ్మల్ని అడిగారు. అప్పుడు ఆయనకు ఇవ్వడానికి మా దగ్గర నీళ్లు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలి నుంచి మిలిటరీ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో బిపిన్ ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా... పురపాలక పాఠ‌శాల‌ల‌ టీచర్ల నిరసన