Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురిని పెళ్లాడాడు.. ముగ్గురూ వెళ్లిపోయారు.. అందుకనీ..

ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.

Advertiesment
ముగ్గురిని పెళ్లాడాడు.. ముగ్గురూ వెళ్లిపోయారు.. అందుకనీ..
, శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:41 IST)
ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన జితేంద్ర (34) అనే వ్యక్తి ఓ పాథాలజీ ల్యాబ్‌లో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ఇద్దరు భార్యలు ఆయన్ను వదిలి విడాకులు తీసుకుని వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత మరో మహిళను పెళ్లాడాడు. ఆమె కూడా తాజాగా ఆయన్ను వదిలి వెళ్లిపోయింది. దీంతో తనకిక ఈ జీవితం అక్కర్లేదనుకున్న అతను, తాను పనిచేసే ల్యాబ్‌లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హంతకులు చచ్చేంత వరకు జైల్లో ఉండాల్సిందే...