Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య చెల్లిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నవ వరుడు.. ఎక్కడ?

Advertiesment
Tamil Nadu
, సోమవారం, 4 మార్చి 2019 (14:25 IST)
పెళ్లియిన 15 రోజుల్లోనే నవ వరుడు దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యపై మోజు తీరకముందే మరదలిపై కన్నేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి తన లైంగికవాంఛ తీర్చుకున్నాడు. ఇంతకీ ఆ యువతి వయసు 13 యేళ్లు మాత్రమే. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువళ్లూరు జిల్లా పెరియపాళయం సమీపంలోని తేర్‌వళి గ్రామానికి చెందిన అజిత్‌కుమార్‌ (22) అనే వ్యక్తి వేలూరు జిల్లా ఆరణిలో ఓ మొబైల్ షాపు నడుపుతున్నాడు. ఈయనకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత నెల 15వ తేదీన వివాహం జరిగింది. గత 15 రోజులుగా భార్యతో దాంపత్య జీవితం అనుభవిస్తూనే 13 యేళ్ళ మరదలిపై కన్నేశాడు. 
 
ఈ క్రమంలో ఫిబ్రవరి 27వ తేదీన ఆ బాలిక కనిపించలేదు. దీంతో ఆమె కోసం తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ అదృశ్యమైన బాలిక చివరిసారి అక్క భర్త బావతో కలిసి వెళ్లినట్టు స్థానికులు వెల్లడించారు. 
 
దీంతో అజిత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ బాలికను కిడ్నాప్‌ చేసి తన షాపులో బంధించి లైంగిక దాడికి పాల్పడినట్టు అంగీకరించాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బాలికను రక్షించి అజిత్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు. అజిత్‌ కుమార్‌పై అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నకుమారులపై తల్లి ఇటుకలతో దాడి.. ఇద్దరూ ఏమయ్యారంటే?