Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి... చిక్కకుండా ఉండేందుకు ప్రియుడుని ఏం చేసిందంటే... (Video)

Advertiesment
trunk box

ఠాగూర్

, శుక్రవారం, 18 అక్టోబరు 2024 (14:43 IST)
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు రాత్రి వేళ ఏకంగా ఆమె ఇంటికే వచ్చాడు. ఇద్దరూ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి తన తల్లి తలుపు తట్టింది. దీంతో చివరకు ఆమె చేసిన నిర్వహాకం చూసి అంతా అవాక్కయ్యారు. 
 
వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ట్రంకు పెట్టెలో ఉండాల్సిన బట్టలు, ఇతర వస్తువులు బయట చిందరవందరగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు అప్పటివరకు ఇంట్లోనే ఉన్న యువతిని నిలదీశారు. దాంతో యువతి తాను ఏమీ చేయలేదని బుకాయించింది. కానీ, ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో తల్లి, సోదరుడు ట్రంకు పెట్టెను తెరవాల్సిందిగా చెప్పారు.
 
అయితే, యువతి అందులో ఏం లేదని, తాను తెరవనని చెప్పింది. చివరకు సోదరుడు గట్టిగా చెప్పడంతో ఆమెకు పెట్టె తెరవక తప్పలేదు. అలా సోదరి పెట్టెను ఓపెన్ చేస్తున్న సమయంలో సోదరుడు వీడియో తీశాడు. అంతే.. పెట్టె తెరుచుకున్న వెంటనే అందులోంచి ఓ యువకుడు బయటకు వచ్చాడు. 
 
అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. బయటకు వచ్చిన ఆ యువకుడు తనకేమీ తెలియనట్టుగా యువతి వెనుకవైపున నిలబడడం వీడియోలో ఉంది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అంతచిన్న పెట్టెలో యువకుడిని ఎలా దాచి పెట్టిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రాద్రిలో పోస్ట్ వైరల్ ఫీవర్ విజృంభణ.. లక్షణాలేంటంటే?