భద్రాద్రి జిల్లాలో పోస్ట్ వైరల్ ఫీవర్ విజృంభిస్తోంది. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే పలుసార్లు వైరల్ ఫీవర్లు, సీజినల్ వ్యాధులపై గ్రామాల్లో ర్యాపిడ్ సర్వేలు నిర్వహించారు. ఇందులో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైపాయిడ్ వంటి జ్వరాల నుంచి కోలుకున్న కొందరిలో పోస్టు వైరల్ ఫీవర్ అనే లక్షణాలు ఉంటున్నాయని, వీటి వల్లనే ఒళ్లు నొప్పులు, కాళ్ల వాపులు ఉంటున్నాయని చెబుతున్నారు.
సుమారు పదేళ్ల క్రితం చికెన్‌గున్యాతో ఇబ్బందిపడ్డ ఏజెన్సీ ప్రజలు ఇప్పుడు పోస్ట్ వైరల్ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపరిశుభ్ర వాతారణం, దోమల కారణంగా జ్వరం విజృంభణకు కారణమని వైద్యులు చెబుతున్నారు.
జ్వరంతో ప్రారంభమై ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసించి బలహీనమవ్వడం ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా కండరాలు, ఎముకల నొప్పులు తీవ్రంగా ఉంటాయి.