Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ పోరాటానికి సెల్యూట్ : టీబీజేపీ నేతలకు మోడీ - షా అభినందనలు

Advertiesment
GHMC Election Results
, శనివారం, 5 డిశెంబరు 2020 (09:23 IST)
అమితాసక్తినిరేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎవరూ ఊహించని విధంగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా 48 డివిజన్లలో విజయభేరీ మోగించింది. ఈ ఫలితాలు ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలు అమితమైన ఆనందానికి లోను చేశాయి. ముఖ్యంగా, తెలంగాణ బీజేపీ నేతల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. దీంతో బీజేపీ పెద్దలు రాష్ట్ర నేతలకు ఫోన్లు చేసి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, జీహెచ్ఎంసీ బీజేపీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ కిషన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ ఫోనులో అభినందించారు. గ్రేటర్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించారంటూ ప్రశంసించారు. కిషన్ రెడ్డికి బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సైతం ఫోన్ చేసి అభినందనల జల్లు కురిపించారు.
 
అటు అమిత్ షా తెలుగులో ట్వీట్ చేసి తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ సాగిస్తున్న రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శనకుగాను జేపీ నడ్డా గారికి, బండి సంజయ్‌కు అభినందనలు అని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నాను అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్టుదిగని కేంద్రం.. బెట్టువీడని రైతులు - 8న భారత్ బంద్