గోడదూకి ఆస్పత్రిలోకి వెళ్లిన లెఫ్టినెంట్ గవర్నర్... ఎవరు?
పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ ఏ పని చేసినా అది చర్చనీయాంశమవుతోంది. మొన్నటికి మొన్న పుదుచ్చేరిలో మహిళా భద్రతపై అర్థరాత్రి ద్విచక్ర వాహనంపై నగర పర్యటన జరిపారు. ఇపుడు ఓ ఆస్పత్రిలో ఆకస్మిక
పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ ఏ పని చేసినా అది చర్చనీయాంశమవుతోంది. మొన్నటికి మొన్న పుదుచ్చేరిలో మహిళా భద్రతపై అర్థరాత్రి ద్విచక్ర వాహనంపై నగర పర్యటన జరిపారు. ఇపుడు ఓ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీల నిమిత్తం ఆమె గోడదూకారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే...
పుదుచ్చేరిలో భాగంగా ఉన్న కారైకల్ ప్రాంతానికి కిరణ్ బేడీ ఐదు రోజుల పర్యటన కోసం వెళ్లారు. అక్కడవున్న ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీయాలని భావించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన ఆమె, విగ్రహం వద్దకు వెళ్లాలని చూశారు.
ఆమె కోరిక తెలుసుకుని అధికారులు తాళాల కోసం లోనికి పరిగెత్తగా, తలుపులు తీస్తారని కాసేపు వేచి చూసిన ఆమెకు, తాళాలు పోగొట్టుకున్నామన్న సమాధానం వచ్చింది. ఇక మరొక్క క్షణం ఎదురుచూడకుండా గోడ దూకి కిరణ్ బేడీ వెళ్లారు.
ఆమెతో పాటు అక్కడే ఉన్న కారైకల్ కలెక్టర్ ఆర్.కేశవన్, ఎస్పీ వీజే.చంద్రన్, ఇతర అధికారులు కూడా మారో మార్గం కనిపించని స్థితిలో గోడ దూకేశారు. ఆపై ఆమె ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించి, పరిసరాలు బాగాలేవని, దోమలు రాజ్యమేలుతున్నాయని చెబుతూ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.