నటుడు ఉపేంద్రకు షాకిచ్చిన గాలి జనార్థన రెడ్డి...
దేశంలో గాలిజనార్థన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయన పేరు ఓ సంచలనమే. ఆయన పేరుతోనే వార్తలు వైరల్ అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ అధినేతగా ఆయన పేరు మారుమ్రోగిన విషయం తెలిసిందే. అందులో ఆయన పేరు బయట పడటంతో గాలిజనార్థన్ రెడ్డి జైలుక
దేశంలో గాలిజనార్థన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయన పేరు ఓ సంచలనమే. ఆయన పేరుతోనే వార్తలు వైరల్ అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ అధినేతగా ఆయన పేరు మారుమ్రోగిన విషయం తెలిసిందే. అందులో ఆయన పేరు బయట పడటంతో గాలిజనార్థన్ రెడ్డి జైలుకు వెళ్ళి చివరకు బెయిల్ పైన వచ్చారు. ఇటీవల తన కుమార్తెకు పెళ్ళి చేసి మళ్ళీ వార్తల్లోకెక్కారు. నోట్ల రద్దు సమయంలో తన కుమార్తె పెళ్ళిని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా చేశాడన్నడే చర్చకు దారితీసింది.
ఈ మధ్య గాలి జనార్థన్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు కిరీటిని సినీ నటుడిగా చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. 2018 ఎన్నికల్లో తన కుమారుడితో సినిమాలు చేస్తానని, తన కుమారుడికి ఎంతో టాలెంట్ ఉందని అతని సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్ పైన చూడొచ్చంటూ చెప్పుకొచ్చారు గాలి జనార్థన్ రెడ్డి. ఇప్పుడు ఉపేంద్ర రాజకీయ పార్టీ కన్నా గాలి జనార్థన్ రెడ్డి కొడుకు రాజకీయాల్లోకి రావాలంటూ కర్ణాటక రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.