Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడియో చూపించిన ఢిల్లీ పోలీస్... దినకరన్ షాక్... శశికళ ఫోటోలు ఔట్...

ఈసీకి లంచం ఇవ్వజూపిన చంద్రశేఖర్ ఎవడో నాకు తెలీదు అని బుకాయించిన దినకరన్ కు ఢిల్లీ పోలీసులు వీడియో చూపించి దినకరన్‌ను షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వీడియో చూడగానే... చంద్రశేఖర్‌ను ఒకసారి అపుడెపుడో కలిసినట్లు గుర్తు అని చెప్పుకొచ్చాడట. అలా మొదలయిన వ్య

Advertiesment
వీడియో చూపించిన ఢిల్లీ పోలీస్... దినకరన్ షాక్... శశికళ ఫోటోలు ఔట్...
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:03 IST)
ఈసీకి లంచం ఇవ్వజూపిన చంద్రశేఖర్ ఎవడో నాకు తెలీదు అని బుకాయించిన దినకరన్ కు ఢిల్లీ పోలీసులు వీడియో చూపించి దినకరన్‌ను షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వీడియో చూడగానే... చంద్రశేఖర్‌ను ఒకసారి అపుడెపుడో కలిసినట్లు గుర్తు అని చెప్పుకొచ్చాడట. అలా మొదలయిన వ్యవహారం ఇంకాస్త ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దినకరన్ వ్యవహారాన్ని తేల్చేందుకు అతడి స్నేహితులను ఢిల్లీ పోలీసులు రంగంలోకి దించారు. వారిని ఒక్కొక్కరిని విడివిడిగా విచారణ చేయిస్తూ దినకరన్ మొత్తం వ్యవహారాన్ని కూపీ లాగుతున్నారు. వారు కొంతమేరకు కీలక సమాచారాన్ని ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
దినకరన్ ఎక్కువగా వాట్స్ యాప్ ద్వారానే మాట్లాడుతారనీ, అందువల్ల మాట్లాడినవన్నీ వెలికి తీయడం కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది. నిపుణలను సంప్రదించి దినకరన్ వాట్స్ యాప్ పరిశీలించగా అందులో చంద్రశేఖర్‌తో దినకరన్ మంతనాలు జరిపినట్లు స్పష్టంగా వెలుగుచూసినట్లు తెలుస్తోంది. కాగా దినకరన్ సన్నిహితుడు శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద దినకరన్‌ను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
ఇంకోవైపు శశికళ ఫోటోలను అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పీకి అవతల పారేశారు. పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ మేరకు పళనిస్వామి వర్గం ఈ చర్యలు చేపట్టింది. అంతేకాదు... శశికళ, దినకరన్ ఇద్దరినీ పార్టీ నుంచి వెలివేస్తేనే తాము చర్చలకు సిద్ధమని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై పళని వర్గం ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడక గదిలో ప్రియుడితో నగ్నంగా కనిపించిన భార్య... భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిన వైనం...