Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

టీమిండియా మాజీ క్రికెటర్ చంద్రశేఖర్ మృతి

Advertiesment
former cricketer
, శుక్రవారం, 16 ఆగస్టు 2019 (08:47 IST)
టీమిండియా మాజీ క్రికెటర్ వీ.బీ చంద్రశేఖర్ గుండెపోటతో కన్నుమూశారు. తమిళనాడుకు చెందిన ఆయన భారత జట్టు తరపున కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడి.. 53 పరుగులు చేశారు. జాతీయ జట్టులో అంతగా స్థానం లభించకపోయినా.. తమిళనాడు తరపున రంజీ  మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
 
దీనితో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కాంచీ వీరన్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. దానితో పాటు చెన్నైలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్రికెట్ అనే పేరుతో ఓ అకాడమీని ప్రారంభించారు.
 
ఈ నేపథ్యంలో గురువారం గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే  చంద్రశేఖర్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
 
 ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరోవైపు చంద్రశేఖర్ మృతిపట్ల మాజీ టీమిండియా కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీబీ దూకుడైన బ్యాట్స్‌మెన్.. భారత్ తరపున ఆయన ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోవడం దురదృష్టకరం. మేమిద్దరం కలిసి ఎన్నో సార్లు కామెంట్రీ కూడా చేశామని గుర్తు చేసుకున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు