Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇకపై 3 కిలోమీటర్లు దాటితే ఫైన్‌..? వాహనం నంబర్‌తో కేసు బుక్‌!

ఇకపై 3 కిలోమీటర్లు దాటితే ఫైన్‌..? వాహనం నంబర్‌తో కేసు బుక్‌!
, మంగళవారం, 31 మార్చి 2020 (06:45 IST)
గల్ఫ్‌ తరహా టెక్నాలజీని పోలీసులు వాడుతున్నారు. ఎవరి వాహనమైనా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధి దాటితే.. ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలతో నిఘా ద్వారా గుర్తిస్తారు.

ఇప్పటికే అన్ని కూడళ్లు, ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి నూతన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు.
 
 కోవిడ్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్  ప్రకటించినా, కొందరు కర్ఫ్యూ ఆంక్షలను పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు పోలీసులు సరికొత్త వ్యూహం పన్నారు. ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌  (ఏఎన్  పీఆర్‌) సాంకేతికతతో రోడ్లపైకి వచ్చిన వాహనం నంబరు గుర్తిస్తున్నారు.

దాని ఆధారంగా వారిపై ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ 1897 ప్రకారం కేసులను నమోదు చేస్తున్నారు. ఈ సాంకేతికత ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఎలాంటి కారు నంబరునైనా, వాహనం ఎంత వేగంలో ఉన్నా సరే ఇది సులభంగా గుర్తిస్తుంది. వాహన యజమాని వివరాలు ప్రత్యక్షమవుతాయి.
 
కేసుల్లో ఇరుక్కోవద్దు: ప్రభుత్వం
లాక్‌డౌన్ నిబంధనల ప్ర కారం.. ప్రతీ వాహనం రెండు కి.మీ.లోపే పరిమితం కావాలి. కానీ, పలువురు ఇష్టానుసారం ప్రయాణిస్తున్నారు. ఈ కెమెరాతో నంబరును గుర్తించి, వాహనదారుడి చిరునామాకు, అతను వాహనం కెమెరాకు చిక్కిన ప్రాంతానికి మధ్య దూరం చూసి కేసు నమోదు చేస్తారు.

గంటల్లోనే సదరు వాహన యజమాని అరెస్టు అవుతారు. అన్ని జిల్లాల్లో ప్రతీ కెమెరాకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు.
 
దీంతో సదరు వాహనం యజమానిపై ఐపీసీ 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడు తుందని హెచ్చరిస్తున్నారు.
 
అకారణంగా ఇళ్ల నుంచి బయటికి వచ్చే వాహనదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు నెలలు నో కరెంట్ బిల్