Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడుకు మూర్చరోగం తగ్గిస్తానంటే ఒళ్లప్పగించేసింది

బాధలను, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మహిళలను వంచించండంలో వారి శరీరాలను నిలువునా దోచుకోవడంలో దొంగస్వాములు ఆరితేరిపోయారు. ఈ బెంగళూరు దొంగస్వామి అయితే అందరినీ మించిపోయాడు. కుమారుడి మూర్చ రోగం నయం చేస్

Advertiesment
కొడుకు మూర్చరోగం తగ్గిస్తానంటే ఒళ్లప్పగించేసింది
హైదరాబాద్ , మంగళవారం, 23 మే 2017 (08:20 IST)
దేశంలో దొంగబాబాలు, కామాంధ స్వాముల మోసాలకు ఆకాశమే హద్దుగా ఉంది. బాధలను, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మహిళలను వంచించండంలో వారి శరీరాలను నిలువునా దోచుకోవడంలో దొంగస్వాములు ఆరితేరిపోయారు. ఈ బెంగళూరు దొంగస్వామి అయితే అందరినీ మించిపోయాడు. కుమారుడి మూర్చ రోగం నయం చేస్తానంటే ఆ పిచ్చితల్లి నమ్మేసింది. ఆ నమ్మకం ఎంతవరకు పోయిందంటే ఆ మహిళకు శారీరక లోపం ఉందని ఆమె నగ్న ఫోటోలు తీయడమే కాకుండా తనతో గడిపితే దోషం పోతుందని నమ్మించి ఆమెపై ఏడుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. దానం చేస్తే కుమారుడి జబ్బు నయం అవుతుందని బంగారు నగలు, హారాలు, కమ్మలు లాగేసాడు. 20 లక్షల రూపాయల నగదు తీసుకున్నాడు. ఓ ఫైన్ మార్నింగ్ చెక్కేశాడు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఇప్పుడా దొంగబాబా  కటకటాలు లెక్కిస్తున్నాడు. ఈ దేశం మాయలను, మంత్రాలను, బాబాలను నమ్ముతున్నంతవరకు ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి.
 
కుమారుని మూర్చరోగం నయం చేస్తానని నమ్మించి తల్లిపై అత్యాచారానికి పాల్పడి, భారీగా డబ్బు, బంగారం కాజేసిన కామాంధ జ్యోతిష్యుణ్ని బెంగళూరు విజయనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు విజయనగరలోని ఆర్‌పీసీ లేఔట్‌ కు చెందిన 35 ఏళ్ల మహిళకు 10 నెలల కొడుకు ఉన్నాడు. చిన్నారికి మూర్ఛ లక్షణాలు కనిపించేవి. కనకపురకు చెందిన జ్యోతిష్యుడు ప్రసన్నకుమార్‌ అలియాస్‌ కార్తీక్‌ విజయనగరలో ఓ గదిని అద్దెకు తీసుకుని జ్యోతిష్యం చెబుతుండేవాడు. బాధితురాలు చిన్నారిని చూపిద్దామని జ్యోతిష్యున్ని కలిసింది. జ్యోతిష్యుడు మహిళకు శారీరక లోపం ఉందని నమ్మించి ఆమె నగ్న ఫోటోలను తీశాడు.
 
తనతో గడిపితే దోషం పోతుందని నమ్మించి ఆమెపై ఏడుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బంగారం, నగదు  దానం చేస్తే కుమారుడి జబ్బు నయమవుతుందని ఆమె నుంచి రెండు బంగారునెక్లెస్లు, రెండు చైన్లు, ఆరు చెవికమ్మలు, మూడు చేతి ఉంగరాలు లాక్కున్నాడు. వీటితో పాటు రూ.20 లక్షల 70 వేల నగదు కూడా తీసుకున్నాడు. తరువాత అడ్రస్‌ లేకుండాపోయాడు. బాధితురాలు మోసపోయానని గ్రహించి వారం క్రితం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి సోమవారం నిందితుణ్ని అరెస్టు చేశారు. ఇతడిపై అత్యాచారం, వంచన, దోపిడీ కేసులు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి. 54 మందికి తీవ్ర గాయాలు. ప్రధాని నరేంద్రమోదీ సంతాపం