Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి. 54 మందికి తీవ్ర గాయాలు. ప్రధాని నరేంద్రమోదీ సంతాపం

ఇంగ్లాండ్‌ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. అమెరికన్‌ పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నఈ ఘటనలో 20 మంది మృతిచెందగా.. 54 మందికి పైగా గాయపడినట్లు సమాచా

Advertiesment
ఇంగ్లండ్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి. 54 మందికి తీవ్ర గాయాలు. ప్రధాని నరేంద్రమోదీ సంతాపం
హైదరాబాద్ , మంగళవారం, 23 మే 2017 (07:53 IST)
ఇంగ్లాండ్‌ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. అమెరికన్‌ పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నఈ ఘటనలో 20 మంది మృతిచెందగా.. 54 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్‌ మాంచెస్టర్‌ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

పేలుడు జరిగిన  ప్రాంతాన్ని ఖాళీ చేయించిన అధికారులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఉన్నవారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారుఘటనను ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. పాప్‌ సింగర్‌ అరియానా క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి వెల్లడించారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్‌ మాంచెస్టర్‌ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, ఈ దాడిలో  పాప్‌ సింగర్‌ అరియానాకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి ప్రకటించారు.
 
పాప్ సింగర్ అరియానా గ్రాండే కచ్చేరి జరుగుతున్న మాంచెస్టర్ ఎరీనా యాజమాన్యం మంగళవారం ఉదయం  ఒక ప్రకటన విడుదల చేసింది. కచ్చేరి జరుగుతున్న వేదిక వెలుపల ఈ దాడి జరిగిందని వెల్లడించింది. బాధితుల కోసం ప్రార్థనలు చేస్తున్నామని, మా ఆలోచనలన్నీ వారి క్షేమం పైనే కేంద్రీకరించి ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. ప్రతిఏటా మాచెస్టర్ ఎరీనాను పది లక్షలమంది సందర్శిస్తుంటారని అంచనా.
 
ప్రపంచ దేశాల నాయకులంతా మాంచెస్టర్ ఎరీనాపై జరిగిన ఉగ్ర దాడిని ఖండించారు.  మాంచెస్టర్ నగరంలో జరిగిన ఉగ్రదాడితో తీవ్రంగా బాధపడుతున్నానని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ దాడిని మేం ఖండిస్తున్నాం, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయాల పాలయిన వారికోసం  ప్రార్తిస్తున్నామని మోదీ తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ ఉగ్ర బాధిత దేశం... పాకిస్థాన్‌కు అవమానం.. ఎక్కడ.. ఎందుకు?