Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్కో ప్రయాణికుడికి రూ.100 ఖర్చు చేసి రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నాం : కేంద్ర మంత్రి అశ్విని

ashwini vaishnav

ఠాగూర్

, ఆదివారం, 3 మార్చి 2024 (17:18 IST)
దేశంలోని ప్రతి రైలు ప్రయాణికుడుకి 55 శాతం రాయితీ ఇస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక్కో ప్రయాణికుడిని గమ్యస్థానానికి ఖర్చు చేసేందుకు రూ.100 ఖర్చు అవుతుందని, కానీ, రైల్వే శాఖ మాత్రం రూ.45 మాత్రమే వసూలు చేస్తుందని చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే 55 శాతం మేరకు ప్రతి ప్రయాణికుడుకి రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు. 
 
రైల్వే ద్వారా ప్రతి సంవత్సరం 700 కోట్ల మంది ప్రయాణిలను గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. మనం తీసుకురానున్న అమృత్ భారత్ రైలు ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడుకొని ఉంటుందన్నారు. రాబోయే కొన్నేళ్లలో 1000 అమృత్ భారత్ రైళ్లను పట్టాలెక్కిస్తామన్నారు. రూ.454తో వెయ్యి మీటర్లు ప్రయాణించవచ్చునన్నారు. గంటకు 250 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు తయారీ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వంతెన, కోల్‌కతా మెట్రో కోసం అండర్ వాటర్ టన్నెల్‌ను నిర్మించినట్లు తెలిపారు.
 
మార్చి 6వ తేదీన కోలకతాలో నిర్మించిన భారతదేశ తొలి అండర్ రివర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారన్నారు. కోల్‌కతా మెట్రో పనులు 1970లో ప్రారంభం కాగా గత పదేళ్లలోనే భారీ పురోగతి సాధించినట్లు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న దేశానికి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళగిరి ఇన్చార్జింగా లావణ్య.. నెల్లూరు లోక్‌సభకు విజయసాయి రెడ్డి