Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతీయ మీడియా అవార్డులు-2021కు ఎంట్రీలు ఆహ్వానం

జాతీయ మీడియా అవార్డులు-2021కు ఎంట్రీలు ఆహ్వానం
, శనివారం, 30 అక్టోబరు 2021 (12:50 IST)
ఓటు హక్కు వినియోగంపై ఓటర్లలో చైతన్యం మరియు అవగాహన కల్పించేందుకు 2012 నుండి కృషిచేసిన ఉత్తమ ప్రచార మాధ్యమాలకు జాతీయ మీడియా అవార్డులను ప్రధానం చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ప్రింట్, టి.వి., రేడియో, ఇంటర్నెట్/సోషల్ మీడియా తదితర నాలుగు కేటగిరీల్లో  ఈ పురస్కారాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. న‌వంబరు 30వ తేదీ లోగా ఈ ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. 2022 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఉత్తమ మీడియా సంస్థలకు ఈ అవార్డులను  ప్రధానం చేయనున్నారు.

అవార్డు కింద సైటేషన్, ఫలకం (Plaque) ప్రధానం చేయనున్నారని సిఇఓ తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేందుకు వారిలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యం కలిగించడం,ఓటరుగా నమోదు,రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో విశేష కృషి చేసిన మీడియా హౌస్ లకు భారత ఎన్నికల సంఘం ఈఅవార్డులను ప్రధానం చేయనుందని ఆయన పేర్కొన్నారు. 

భారత ఎన్నికల సంఘం చే ఏర్పాటు చేయబడిన ప్రత్యేక జ్యూరీ  మాధ్యమాలు నిర్వహించిన క్వాలిటీ ఆఫ్ ఓటరు అవేర్నెస్ క్యాంపెయిన్, ఎక్ట్సెంట్ ఆఫ్ కవరేజ్/క్వాంటిటీ,ఓటరు అవగాహన కార్యక్రమాల ఆధారంగా ఉత్తమ ఎంట్రీల ఎంపిక చేసి  పురస్కారాలను అందజేయడం జరుగుతుందని సిఇఓ విజయానంద్ తెలిపారు.

ఎంట్రీలకు సంబంధించి ప్రింట్ మీడియా న్యూస్ ఐటంమ్స్/ఆర్టికల్స్ ప్రచురితమైన కాలం సెంటీమీటర్లు వివరాలను సాప్ట్ కాఫీ పిడిఎఫ్ లేదా న్యూస్ పేపర్/ఆర్టికల్స్ పుల్ సైజ్ పొటోకాఫీ/ప్రింట్ కాఫీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.బ్రాడ్ కాస్ట్ టెలివిజన్(ఎలక్ట్రానిక్) మరియు రేడియో(ఎలక్ట్రానిక్)ఎంట్రీలు క్యాంపెయిన్ /వర్కు సంక్తిప్త సమాచారం సిడి లేదా డివిడి లేదా పెన్ డ్రైవ్ ద్వారా బ్రాడ్ కాస్ట్/టెలికాస్ట్ అయిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

అలాగే అన్ని స్పాట్లు/న్యూస్ వివరాలను,ఓటరు అవగాహనకు సంబంధించిన న్యూస్ ఫీచర్లు లేదా ప్రోగ్రామ్ లకు సంబంధించిన సిడి లేదా డివిడి లేక పెన్ డ్రైవ్ రూపంలో టెలికాస్ట్/బ్రాడ్ కాస్ట్ అయిన వ్యవధి,తేదీ,సమయం మరియు ప్రీక్వెన్సీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆన్లైన్(ఇంటర్నెట్)/సోషల్ మీడియా ఎంట్రీలు పంపేవారు విధిగా ఓటరు అవగాహనకు సంబంధించిన ఆనిర్దేశిత సమయంలో చేసిన పోస్టులు/బ్లాగ్స్/క్యాంపెయిన్లు/ట్వీట్లు/ఆర్టికల్స్ వంటి వాటి వివరాలను పిడిఎఫ్ సాప్ట్ కాఫీ లేదా సంబంధిత వెబ్ లింక్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.అలాగే పబ్లిక్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఇతర కార్యక్రమాలు,ఇంపాక్ట్ ఆఫ్ ఆన్లైన్ యాక్టివిటీ వివరాలను ఆయా ఎంట్రీలతో కలిపి సమర్పించాల్సి ఉంటుంది.

ఓటర్లలో చైతన్యం, అవగాహనపై నేషనల్ మీడియా అవార్డ్సు-2021కు ఎంట్రీలు పంపే వారు హిందీ,ఆంగ్లం మినహా మిగతా భాషలకు సంబంధించినవి ఆంగ్లం ట్రాన్సులేషన్ తో కలిపి పంపాల్సి ఉంటుంది.ప్రతి ఎంట్రీకి సంబంధించి విధిగా మీడియా హౌస్ యొక్క పేరు,అడ్రస్, టెలిఫోన్ నంబరు,ఫ్యాక్స్ నంబర్లు మరియు ఇ-మెయిల్ అడ్రస్ కలిగి ఉండాలి.

ఎంట్రీలను ఈఏడాది నవంబరు 30వ తేదీ లోగా ఈక్రింది అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. ఎంట్రీలు పంపాల్సిన చిరునామా.. పవన్ దివాన్,అండర్ సెక్రటరీ(కమ్యునికేషన్), ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్డు,న్యూఢిల్లీ 110001. ఇ.మెయిల్:[email protected]. ఫోన్ నంబరు:011-23052133.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌