Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌

ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌
, శనివారం, 30 అక్టోబరు 2021 (12:45 IST)
ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ  ప్రక్రియ మొదలుకావడంతో ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌ అయ్యాయి. ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రొటోకాల్‌ అమలు చేసేవారు.

ఇకమీదట ఆ సదుపాయం ఉండదు. ఎంపీలు డబ్బు పెట్టి విమాన టికెట్లు కొనాలని శుక్రవారం విడుదలైన రాజ్యసభ సచివాలయ బులెటిన్‌ సభ్యులకు సూచించింది.

పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా  34 విమాన టికెట్లు, వారి జీవిత భాగస్వామికి మరో 8 టికెట్లు గతంలో ఉచితంగా ఇచ్చేవారు. వాటి కొనుగోలుకు పార్లమెంటు ఉభయసభల సచివాలయాలు 'ఎక్స్ఛేంజ్‌ ఆర్డర్‌' జారీ చేసేవి.

ఆ ఉత్తర్వులు చూపి డబ్బు పెట్టకుండానే ఎంపీలు ఎయిర్‌ ఇండియా టికెట్లు కొనుగోలు చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశారు.

రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ఎక్స్ఛేంజ్‌ ఆర్డర్లను అనుసరించి టికెట్లు కొని ఉంటే అందుకు సంబంధించిన టీఏ క్లెయిమ్‌లు చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో తిరుమల ఘాట్‌ రోడ్లపైకి ఎలక్ట్రికల్‌ బస్సులు