అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) పేర్కొంది. బాసర్‌లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది
బాసర్‌కు ఉత్తర వాయువ్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. వేకువ జామున ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
నిద్రలో ఉండగా సంభవించిన భూకంపం ధాటికి ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. దీంతో ఇళ్లనుంచి నుంచి పరుగులు పెట్టారు. హిమాలయాల్లో ఒదిగినట్టుండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తరచూ భూకంపాలు భయకంపితులను చేస్తున్నాయి.