Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీకేశారు... సొంత పార్టీ యోచనలో దినకరన్...

పళణిస్వామి, పన్నీరుసెల్వం చేతిలో దారుణంగా దెబ్బతిని అన్నాడిఎంకే పార్టీ నుంచి బహిష్కరించబడ్డ దినకరన్ సొంత పార్టీ యోచనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓపిఎస్, ఇపిఎస్‌లిద్దరంటే పడని దినకరన్ తమను పార్టీ నుంచి బయటకు పంపించడానికి మీరెవరంటూ ప్రశ

పీకేశారు... సొంత పార్టీ యోచనలో దినకరన్...
, మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (17:04 IST)
పళణిస్వామి, పన్నీరుసెల్వం చేతిలో దారుణంగా దెబ్బతిని అన్నాడిఎంకే పార్టీ నుంచి బహిష్కరించబడ్డ దినకరన్ సొంత పార్టీ యోచనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓపిఎస్, ఇపిఎస్‌లిద్దరంటే పడని దినకరన్ తమను పార్టీ నుంచి బయటకు పంపించడానికి మీరెవరంటూ ప్రశ్నించాడు. అయితే తన వెంట ఎమ్మెల్యేలతో పాటు తన అత్త శశికళకు ఉన్న పరిచయాలతో సొంతంగా పార్టీ పెట్టుకుంటేనే మంచిదన్న ఆలోచనలో దినకరన్ ఉన్నారట. 
 
ఇదే విషయాన్ని తన వెంట ఉన్న ఎమ్మెల్యేలందరికీ దినకరన్ చెప్పినట్లు తెలుస్తోంది. అన్నాడిఎంకేకు దగ్గరగా పార్టీ పేరు ఉండాలన్నది శశికళ, దినకరన్ ఆలోచన. ఆ పేరు కోసం ప్రస్తుతం దినకరన్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఓపిఎస్, ఇపిఎస్ మీద పోరాటం చేసి పార్టీలోకి వెళితే ఓకే కానీ అది జరుగకపోతే మాత్రం సొంతంగా పార్టీతోనే ప్రజల్లోకి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అన్నాడిఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయింది కాబట్టి... ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత పార్టీనే మంచిదన్న ఆలోచనలో ఉన్నారట దినకరన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఒక్కటితప్ప జయలలిత అధికారాలన్నీ నమ్మినబంటుకే...