Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీపై కరోనా డెల్టా పంజా... 83.3 శాతం పాజిటివ్ రేటు

Advertiesment
Delta Variant
, సోమవారం, 9 ఆగస్టు 2021 (09:24 IST)
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్‌ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో అనేక మంది డెల్టా వేరియంట్‌ బారినపడినట్టు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో తేలింది. దాదాపు 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌గా గుర్తించారు. 
 
ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఒక సమావేశంలో ఆరోగ్యశాఖకు పలు వివరాలు తెలిపింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 83.3 శాతం శాంపిల్స్‌లో డెల్టా వేరియంట్ (B.1.617.2) గుర్తించినట్లు పేర్కొంది.
 
మే నెలలో 81.7, జూన్‌ నెలలో 88.6, ఏప్రిల్‌ నెలలో 53.9 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌ బారినపడ్డట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లో ఢిల్లీ నుంచి 5,752 శాంపిల్స్‌లో 1,689లో డెల్టా, 947 నమూనాలు ఆల్ఫా వేరియంట్‌ కేసులు రికార్డయ్యాయి. 
 
ఇకపోతే, ఢిల్లీలో రెండో దశ ఉధృతికి డెల్టా వేరియంట్‌ ప్రధాన కారణమని గుర్తించారు. లక్షలాది మంది జనం వేరియంట్‌ బారినపడగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్ఫా వేరియంట్‌ను గతేడాది యూకేలో కనుగొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రలో ఈరోజు ..హిరోషిమాపై అణ్వాయుధ ప్రయోగం