ఢిల్లీలో మరో హత్య సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్య చేసింది. భర్తను కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. ఆపై భర్త మృతదేహాన్ని 22 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. ఆపై కుమారుడితో కలిసి భర్త శరీర భాగాలను పడేసేందుకు నిందితురాలు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పాండవ్ నగర్లో భర్తను హత్య చేసి త్రిలోక్‌పురికి చెందిన ఓ వ్యక్తిని కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు పూనమ్, ఆమె కుమారుడు దీపక్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. మృతుడిని అంజన్ గాస్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. నిందితులు పాలిథీన్ బ్యాగుల్లో మృతుడి శరీర భాగాలు తరలిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయని పోలీసులు చెప్పారు.