Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ...

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ ఆరేళ్ళ బాలుడిని ఓ దుర్మార్గుడు అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ...
, ఆదివారం, 1 అక్టోబరు 2017 (10:11 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ ఆరేళ్ళ బాలుడిని ఓ దుర్మార్గుడు అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ పరిధిలోని ఓఖ్లా ఫేజ్ 2లో రోహిత్ అనే వ్యక్తి తన భార్యతో కలసి నివశిస్తున్నాడు. రోహిత్ భార్య స్నానం చేస్తుండగా ఆరేళ్ళ బాలుడు చూశాడు. దీంతో ఆగ్రహంచిన రోహిత్ ఆ బాలుడిని హత్య చేశాడు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని బాక్స్ బెడ్‌లో భద్రపరిచాడు. పిమ్మట రోహిత్ పరారై, సెల్ ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు. 
 
అయితే, తమ బిడ్డ కనిపించడం లేదనీ బాలుడి తల్లిదండ్రులు గత నెల 27వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... రోహిత్‌పై అనుమానంతో నిఘా పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. 
 
ఈ విచారణలో తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడని, ఆపై పిచ్చి మాటలు మాట్లాడాడన్న ఆగ్రహంతో అతన్ని చంపేసినట్టు రోహిత్ విచారణలో అంగీకరించాడు. దీంతో అతనిపై హత్యా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాది హఫీజ్ సయీద్ పార్టీని నిషేధించండి : ఈసీకి పాక్ సిఫారసు