Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థులు కాదు.. రౌడీలు : బ్లేడుతో దాడి.... 35 కుట్లు

ఢిల్లీ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే పలువురు విద్యార్థుల్లో రాక్షసత్వం పెరిగిపోతోంది. పలువురు విద్యార్థులు సాటి విద్యార్థుల పట్ల అత్యంత కిరాతకంగా నడుచుకుంటూ తమలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. తాజాగ

Advertiesment
విద్యార్థులు కాదు.. రౌడీలు : బ్లేడుతో దాడి.... 35 కుట్లు
, ఆదివారం, 15 జులై 2018 (10:09 IST)
ఢిల్లీ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే పలువురు విద్యార్థుల్లో రాక్షసత్వం పెరిగిపోతోంది. పలువురు విద్యార్థులు సాటి విద్యార్థుల పట్ల అత్యంత కిరాతకంగా నడుచుకుంటూ తమలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. తాజాగా తోటి విద్యార్థిని బ్లేడుతో కోయడంతో ఆ స్కూడెంట్‌కి 35 కుట్లు పడ్డాయి. ఈ సంఘటన శనివారం దేశరాజధాని ఢిల్లీలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని బాదార్‌పూరు కేంద్రీయ విద్యాలయంలో ఏడో తరగతి విద్యార్థుల మధ్య తరగతి గదిలో కూర్చొనే కుర్చీ విషయంలో చిన్నపాటి తగాదా ఏర్పడింది. రఫీ అనే విద్యార్థి కూర్చున్న సీటు తనకు ఇవ్వాల్సిందిగా మరో విద్యార్ధి బెదిరించాడు. దీనికి రఫీ తిరస్కరిచండంతో.. భోజన విరామ సమయంలో సదరు విద్యార్థి తన స్నేహితులతో కలిసి మరుగుదొడ్డిలో ఉన్న రఫీపై బ్లాడ్స్‌తో తీవ్రంగా దాడిచేశారు. 
 
ఈ దాడిలో రఫీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం అక్కడే ప్రథమ చికిత్సను అందించింది. తీవ్ర రక్తస్రవం ఎక్కువ కావడంతో స్కూల్‌ యాజమాన్యం అతన్ని ఢిల్లీలోని ఎయియ్స్‌కి తరలించారు. విద్యార్థి వీపు భాగంలో బ్లేడ్‌‌తో తీవ్రంగా గాయపర్చడం వల్ల 35 కుట్లు వేసినట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. 
 
తనను విద్యార్థులు బెదిరిస్తున్నట్లు రఫీ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పటించుకోలేదని బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు.  ఘటనలో పాల్గొన్న అందరూ మైనర్లే కావడం వల్ల పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దడపుట్టిస్తున్న హెచ్1బి... కొత్త రూల్స్‌తో గుండె గుబేలు