పొట్టి దుస్తులు ధరించి అర్థనగ్న ప్రదర్శలు చేయడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఇదే అంశంపై ఆమె ఓ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా అది వైరల్ అయింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, 'ఇప్పుడు రికార్డు చేయండి... ఈ అమ్మాయిలు షార్ట్‌లు, పొట్టి దుస్తులు ధరించి అర్థనగ్నంగా ఉండటం వల్ల అత్యాచారాలకు గురవుతున్నారు' అని ఢిల్లీకి చెందిన మధ్యవయస్కురాలైన ఓ మహిళ ఆరోపించారు.
ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‍కు వచ్చిన మహిళ షార్టులు ధరించిన అమ్మాయిల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. యువతులే కురచ దుస్తులు ధరించి అత్యాచారాలకు అవకాశం కల్పిస్తున్నారని సదరు మహిళ చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఉన్న అమ్మాయిలు వ్యతిరేకించారు.
తమపై వ్యాఖ్యలు చేసిన మహిళ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తూ యువతులు మహిళతో వాగ్వాదానికి దిగారు. తాను క్షమాపణలు చెప్పేది లేదని మహిళ తెగేసి చెప్పారు. 'ఈ అమ్మాయిలు కురచ దుస్తులే వేసుకుంటున్నారు... వారిని వారి తల్లిదండ్రులే అదుపులో పెట్టాలి' అంటూ మహిళ కోరడం విశేషం.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. మహిళ వ్యాఖ్యలను అమ్మాయిలు వ్యతిరేకిస్తున్నారు. ఈ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ మంది, ఫేస్‌బుక్‌లో 32 వేల మంది నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.