బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‍లో ప్రాంతంలో వరుసగా గ్యాస్ సిలిండర్లు పేలాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ పేలుళ్ళ తర్వాత ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యాయి. ఒకే ప్రాంతంలో ఏకంగా 30 నుంచి 35 సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
ట్రక్కులో ఉన్న సిలిండర్లు ఉన్నట్టుండి ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. అర్థరాత్రి వేళ 2.30 నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.