Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ALERT: తీరం దాటిన గులాబ్ తుపాన్.. భారీ వర్షాలు, ఈదురుగాలులు

Advertiesment
ALERT: తీరం దాటిన గులాబ్ తుపాన్.. భారీ వర్షాలు, ఈదురుగాలులు
, సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:12 IST)
గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. గులాబ్‌ తుఫాన్ తీరం దాటింది. గులాబ్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 
 
ఈదురుగాలుల దెబ్బకు చెట్లు పడిపోయి విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళంలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అన్నిశాఖల అధికారులు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టారు.
 
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తుపాన్‌ తీరం దాటినట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. మరో 5 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర అల్పపీడనంగా మారి బలహీన పడనుంది. ఈ ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో తీరం వెంట గంటకు 80-90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bharat Bandh: జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులపై రైతుల నిరసన