Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్-19: వృద్ధులకు ముఖ్య సూచనలు, తప్పకుండా గమనించాలి (video)

Advertiesment
కోవిడ్-19: వృద్ధులకు ముఖ్య సూచనలు, తప్పకుండా గమనించాలి (video)
, గురువారం, 25 జూన్ 2020 (11:19 IST)
కోవిడ్-19 వైరస్ వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇదివరకే ప్రకటించింది. వీరిలో వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉండడం, రోగ నిరోధకశక్తి తగ్గిపోవడం వల్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకూ పలు సూచనలు చేసింది.
 
• వృద్ధులలో రోగనిరోధక శక్తి మరియు శరీర పటుత్వము తక్కువగా ఉంటుంది.
• అలాగే బహుళ అనుబంధ వ్యాధుల వల్ల కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 
• వృద్ధులు ఇంట్లోనే ఉండాలి, సందర్శకులను కలవకుండా ఉండాలి. ఒకవేళ కలవాల్సి వస్తే కనీసం ఒక   మీటరు దూరం పాటించాలి.
• సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడగడం, దగ్గేటప్పుడు-తుమ్మేటప్పుడు మోచేయిని అడ్డుపెట్టడం, టిష్యూ పేపర్ వాడి పారవేయడం లేదా రుమాలును ఉపయోగించి తరువాత శుభ్ర పరచడం లాంటివి అలవర్చుకోవాలి.
• తాజాగా ఇంట్లో వండిన వేడి భోజనం తీసుకుంటూ, ఒంట్లో తరచూ హైడ్రేటింగ్ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి తాజా పళ్లరసాలు తీసుకోవాలి.
• వృద్ధులు కంటి శుక్లం, మోకాలి మార్పిడి వంటి  శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోవాలి ఆరోగ్య సంరక్షణకు ఎప్పటికప్పుడు వైద్యులను ఫోన్ లో సంప్రదించి తదనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి
• పార్కులు, మార్కెట్లు, మత ప్రదేశాలు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు.

* పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన చర్యలను తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతోంది.*
•  60 సంవత్సరాల పై బడిన వారికి వెంటనే ట్రూనాట్ టెస్ట్ ను చేయాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే వెంటనే ఈ కింది ప్రొటోకాల్ పాటించాలి.
• ట్రునాట్ పరీక్ష ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఊహాజనిత సానుకూల కేసులుగా పరిగణించబడతాయి. ఈ కేసులనన్నింటినీ దగ్గరలో ఉన్న కోవిడ్ హాస్పటల్ కు తరలించి ఎరితో కలిసేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చర్యలు టెస్ట్ తో ధృవీకరించేందుకు చర్యలు తీసుకోబడతాయి.
• ట్రూనాట్ పాజిటివ్ (ప్రిపెక్టివ్ పాజిటివ్) పరీక్షల ద్వారా కోవిడ్ ఆస్పత్రులలో చేరిన వారందరికీ ఆర్డర్ నెం. 29లో ఇచ్చిన ప్రొటోకాల్స్ ప్రకారం చికిత్స అందించాలి.
• ఇంకా క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని అనుమానిత కేసులలో సింప్టోమాటిక్, కోవిడ్ పాజిటివ్ కేసుల యొక్క ప్రైమరీ మరియు సెంకండరీ కాంటాక్ట్) లో 60 ఏళ్లు పైబడిన వారిందర్నీ వేరుగా   ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

నమూనా పరీక్ష కోసం కింది ప్రాధాన్యతలను పాటించాలి:
* అన్ని ట్రునాట్ పాజిటివ్ కేసులు 
* అన్ని 3వ నమూనా కేసులు (15 వ రోజున ఇంటికి పంపించాలి.)
* అన్ని 2వ నమూనా కేసులు  (14 వ రోజు )
* రోగలక్షణాల అనుమానిత కేసులు

• అన్ని క్వారంటైన్ కేంద్రాలలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా 60ఏళ్లకు పైబడిన వారందరిని విడిగా ఐసోలేషన్ లో ఉంచాలి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ క్లాసుల కోసం ప్రత్యేక ఫీజులు.. స్నాక్స్‌, ట్రాన్స్‌పోర్ట్ లేకపోయినా..?