Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాస్కులను తప్పనిసరి చేస్తున్న రాష్ట్రాలు.. కర్నాటక - తమిళనాడులో ఆదేశాలు

face mask
, సోమవారం, 26 డిశెంబరు 2022 (19:49 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు పలు రాష్ట్రాలు అపుడే ఉపక్రమిస్తున్నాయి. కేంద్ర సూచనలతో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమల్లోకి తెస్తున్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్7 సబ్ వేరియంట్‌తో ముప్పు ఉందన్న నిపుణులతో హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు మళ్లీ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా, విద్యా సంస్థల్లో మాస్కును తప్పనిసరి చేసింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కర్నాటక ఆరోగ్య శాఖ కేశవ సుధాకర్ వెల్లడించారు. అలాగే, తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరిచేసింది. 
 
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు రెస్టారెంట్లు, బార్లలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, కొత్త సంవత్సర వేడుకలు రాత్రి ఒంటిగంట లోపే ముగించాల్సి ఉంటుందని కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ వేడుకలు జరిగే చోట పరిమితి మించి జనం గుమికూడరాదని తెలిపింది. అదేసమయంలో కరోనా పరిస్థితులపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వండర్‌లా హైదరాబాద్‌ వద్ద సన్‌బర్న్‌తో ఎన్‌వైఈ వేడుక చేసుకోండి