Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీని గాలి జనార్థన్ రెడ్డి వీడటానికి కారణం ఇదేనా?

gali janardhan reddy
, సోమవారం, 26 డిశెంబరు 2022 (13:14 IST)
కర్నాటక మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వీడారు. పైగా కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పారు. ఇది కర్నాటకలోనే కాకుండా, దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కుని సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్‌పై బయట తిరుగుతున్న గాలి జనార్థన్ రెడ్డి ఇపుడు ఉన్నట్టుండి బీజేపీని వీడి "కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష" పేరుతో కొత్త పార్టీని స్థాపించడంలో ఆంతర్యం ఏంటన్నదానిపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. 
 
పైగా, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గాలి జనార్థన్ రెడ్డి కూడా వచ్చే 2023లో కర్నాటక అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఆయన తన భార్యతో కలిసి ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
 
మరోవైపు, నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.6 కోట్లను విరాళంగా కూడా ఇచ్చారు. ఇది బీజేపీ నేతలకు ఏమాత్రం నచ్చలేదు. గాలి చర్యలపై బీజేపీ కర్నాటక నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. దీంతో ఆయన గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రటించడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా వెళ్లే విద్యార్థులకు శుభవార్త