Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

17 ఏళ్లు నిండిన యువతకు ఓటర్‌ కార్డు..

voter id card
, గురువారం, 28 జులై 2022 (15:13 IST)
18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్‌ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. 
 
దీంతో జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్‌ కార్డు అందిస్తారు. 
 
కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
17 ఏళ్లు పైబడిన యువత ఓటర్‌ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.
 
యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. 
 
2023లో ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాపెల్స్‌ డాట్‌ కామ్‌పై మాపెల్స్‌ రియల్‌ వ్యూ ద్వారా వర్ట్యువల్‌గా 3డీ మెటావర్శ్‌ మ్యాప్‌ సర్వీస్‌