Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాయ్‌ఫ్రెండ్‌తో బాలికపై రేప్ చేయించిన టీచర్? ఆపై వీడియో తీసి?

Advertiesment
బాయ్‌ఫ్రెండ్‌తో బాలికపై రేప్ చేయించిన టీచర్? ఆపై వీడియో తీసి?
, గురువారం, 7 నవంబరు 2019 (14:57 IST)
ట్యూషన్ టీచర్ వక్రబుద్ధి బయటపడింది. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ట్యూషన్ టీచర్ విద్యార్థినులపై లైంగిక దాడిని వీడియో తీసి బెదిరించేది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన సంజన (28) 10వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు చాలా కాలంగా ట్యూషన్స్ చెబుతోంది. ప్రతి రోజూ సాయంత్రం విద్యార్థులు ఆమె ఇంటికి ట్యూషన్ కోసం వస్తుంటారు. 
 
ఇలా 14 ఏళ్ల బాలిక ఆమె వద్ద ట్యూషన్ కోసం వస్తుండేది. విద్యార్థులు ట్యూషన్‌లో ఉన్న సమయంలో కొన్నిసార్లు సంజన బాయ్‌ఫ్రెండ్ బాలాజీ (38) ఇంటికి వచ్చేవాడు. ట్యూషన్‌ పిల్లలతో మాటలు కలిపేవాడు. అలా ఆ బాలికతోనూ మాట్లాడేవాడు. ఇదే క్రమంలో ఓ రోజు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక సంజనకు తెలియజేసినా.. తన బాగోతం బయటపడుతుందని జడుసుకున్న సంజన బాలికను హెచ్చరించింది. ఇంకా ఈ విషయం బయటికి చెప్పకూడదని బెదిరించింది. 
 
అంతేకాదు, తన ముందే మరోసారి బాయ్‌ఫ్రెండ్‌తో బాలికపై అత్యాచారానికి పాల్పడేలా చేసింది. అదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఇంటి నుంచి డబ్బు, నగలు తీసుకురావాలని.. లేదంటే ఆ వీడియోలు లీక్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేసింది. 
 
భయపడ్డ బాలిక సంజన చెప్పినట్టు అప్పుడప్పుడు నగదు తీసుకొచ్చి ఇచ్చేది. ఇదే క్రమంలో దీపావళికి కొద్దిరోజుల ముందు ఆ బాలిక.. ఇంట్లో నుంచి డబ్బు దొంగిలించి సంజనకు ఇచ్చింది. ఇంట్లో తరుచూ డబ్బు మాయమవుతుండటంపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. బాలికను గట్టిగా నిలదీయగా.. అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధిత బాలిక తల్లిదండ్రులు సంజన, బాలాజీలపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది తలుచుకుని శశికళకు రాత్రి వేళల్లో నిద్రపట్టడం లేదట?