Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుమానంగా వుంది... అందుకే ఆ ఎయిర్‌హోస్టెస్‌ల బట్టలిప్పిస్తున్నాం...

విధులు నిర్వహించేటపుడు ఒక్కోచోట యువతులు పడే బాధ చెప్పనలవి కాదు. ఒకవైపు లైంగిక వేధింపులు, ఇంకోవైపు రకరాకల టార్చర్లు. ఇవన్నీ తట్టుకుంటూ యువతులు ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. ఇదిలావుంటే తాజాగా వెలుగుచూసిన ఘటన షాకిచ్చేలా వుంది. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో

అనుమానంగా వుంది... అందుకే ఆ ఎయిర్‌హోస్టెస్‌ల బట్టలిప్పిస్తున్నాం...
, శనివారం, 31 మార్చి 2018 (19:14 IST)
విధులు నిర్వహించేటపుడు ఒక్కోచోట యువతులు పడే బాధ చెప్పనలవి కాదు. ఒకవైపు లైంగిక వేధింపులు, ఇంకోవైపు రకరాకల టార్చర్లు. ఇవన్నీ తట్టుకుంటూ యువతులు ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. ఇదిలావుంటే తాజాగా వెలుగుచూసిన ఘటన షాకిచ్చేలా వుంది. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఎయిర్ హోస్టెస్‌లను సొంత భద్రతా సిబ్బందే దుస్తులు తొలగించి మరీ చెక్ చేస్తున్నారట. ఇదంతా ఓ ఎయిర్ హోస్టెస్ స్వయంగా మీడియాకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. 
 
తమను తనిఖీల పేరుతో మహిళా భద్రతా సిబ్బంది తమ దుస్తులు తొలగించి శరీరంపై నూలుపోగు లేకుండా నిలువబెట్టి అసభ్యంగా తాకారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సహజంగా విమానాల్లో విధులు నిర్వర్తించే ఎయిర్ హోస్టెస్ లకు విధులకు హాజరయ్యేటపుడు, డ్యూటీ ముగిసిన తర్వాత తనిఖీలు మామూలే. ఐతే ఇంత దారుణమైన తనిఖీలు ఎక్కడా చూడలేదని ఆమె బాధ వ్యక్తం చేసింది. 
 
తాము విమాన ప్రయాణంలో ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు అమ్మగా వచ్చిన డబ్బులు దొంగిలిస్తున్నామన్న అనుమానంతో యాజమాన్యం ఇలా చేస్తోందని తెలిపింది. సిబ్బందికి ఇలాంటి వేధింపులు అత్యాచారాలకు తక్కువేమీ కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా సిబ్బంది తనిఖీల పట్ల స్పైస్‌ జెట్ తన చర్యలను సమర్ధించుకోవడమే కాకుండా కొందరు విమానాల్లో నుంచి కంపెనీ వస్తువులను తీసుకుని వెళుతున్నారన్న అనుమానం కలగడం వల్లే తనిఖీలు చేస్తున్నామన్నారు. ఐతే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పైస్ జెట్ సంస్థ అధికారి మరొకరు వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో సొంత పట్టణానికి మలాలా: తిరిగి వచ్చేస్తానంటూ.. కంటతడి