Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ 'డిపి' మార్చుకుంటే నీ అందం అదిరిపోతోంది: విద్యార్థినితో ప్రొఫెసర్ చాటింగ్

Advertiesment
beauty
, శనివారం, 20 ఫిబ్రవరి 2021 (13:50 IST)
ఎంఫిల్, డాక్టరేట్ సాధించాలంటే అమ్మాయిలు అలా లొంగిపోవాల్సిందేనంటూ ఇప్పటికే ఆరోపణలు వున్నాయి. ఈ వాదనలను నిజం చేస్తూ ఓ ప్రొఫెసర్ ఎంఫిల్ విద్యార్థినికి డిగ్రీ ఇచ్చేందుకు ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది కాస్తా వాట్సప్ సంభాషణలో వెల్లడైంది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఓ కళాశాల ప్రొఫెసర్ తనలోని కామావతరాన్ని బయటపెట్టాడు. క్యాంపస్ ప్రొఫెసర్ అయిన ఆయన విద్యార్థినితో చాటింగ్ చేస్తూ... నీ ముక్కు చాలా బాగుంటుంది. నీలాంటి అందమైన అమ్మాయితో స్నేహాన్ని ఎవరు కోరుకోరు చెప్పు.
 
జస్ట్ నువ్వు కొంచెం బరువు తగ్గితే ఇంకా బాగుంటావు. ఫ్యాట్‌గా వున్నా సరే బాగానే వున్నావనుకో. నీ డిస్‌ప్లే పిక్చర్ - డిపి, ఎందుకు మార్చుకోవూ, అంటూ చాట్ చేసినది బయటపడింది. దీనితో ఎంఫిల్ ఎంట్రెన్స్ పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థునులను ఇలా లొంగదీసుకునేందుకు ప్రొఫెసర్లు ప్రయత్నిస్తున్నారని తేలింది.
 
ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ ప్రవర్తనను ఖండించిన విద్యార్థులు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు బిడ్డ అడ్డుగా వున్నాడని చంపేసింది