దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఈ ప్రకటనను ప్రధాని ప్రకటించారు.
కరోనా సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మార్చి 2020 నుంచి ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో.. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోదీ వెల్లడించారు.