Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోం వర్క్ చేయలేదనే కోపంతో.. అమ్మాయిల్ని జుట్టు పట్టుకుని తిప్పుతూ..

హోం వర్క్ చేయలేదనే కోపంతో ఓ టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అమ్మాయిలను జుట్టు పట్టుకుని తిప్పుతూ.. ఉన్మాదిలా ఊగిపోయాడు. తలకు దెబ్బ తగిలేలా పలుసార్లు బలంగా కొట్టాడు. అమ్మాయిలే కాదు.. అ

Advertiesment
Caught On Camera: Teacher Brutally Assaults Students in Karnal
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (12:18 IST)
హోం వర్క్ చేయలేదనే కోపంతో ఓ టీచర్  విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అమ్మాయిలను జుట్టు పట్టుకుని తిప్పుతూ.. ఉన్మాదిలా ఊగిపోయాడు. తలకు దెబ్బ తగిలేలా పలుసార్లు బలంగా కొట్టాడు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిల పైనా అదే ప్రతాపం చూపించాడు. విద్యార్థుల పట్ల వీధి రౌడీలా ప్రవర్తించిన ఆ వ్యక్తి టీచర్. హరియాణాలోని కర్నల్ లో టీచర్ చేసిన నిర్వాకాన్ని ఓ విద్యార్థి రహస్యంగా వీడియో తీశాడు.
 
కర్నల్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ టీచర్‌ను ప్రదీప్ ఆరోరాగా గుర్తించారు. కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఇతడే. హోం వర్క్ చేయని 10, ఇంటర్ విద్యార్థులను దారుణంగా కొట్టాడు. క్లాస్‌లో వెనుక వైపు కూర్చున్న ఓ విద్యార్థి మొబైల్ ఫోన్ తో టీచర్ నిర్వాకాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఓ టీవీలో ప్రసారమవడంతో టీచర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. 
 
ప్రదీన్ అరోరా రిటైర్డ్ నేవీ ఉద్యోగి అని విచారణలో తేలింది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ఎలాంటి శిక్షయినా వేయాలని తల్లిదండ్రులు తనకు చెప్పారని అరోరా వివరణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శభాష్.. నరేంద్ర మోడీజీ... నాడు అటల్ జీ చేయలేనిది మీరు చేశారు... సూపర్