Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శభాష్.. నరేంద్ర మోడీజీ... నాడు అటల్ జీ చేయలేనిది మీరు చేశారు... సూపర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్థాన్ పట్ల అనుసరిస్తున్న వైఖరినీ ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి చేయలేనిది ప్రధానిగా మోడీ చేసి చ

Advertiesment
Narendra Modi
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (12:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్థాన్ పట్ల అనుసరిస్తున్న వైఖరినీ ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి చేయలేనిది ప్రధానిగా మోడీ చేసి చూపించారంటూ వ్యాఖ్యానించారు. దీనికి గత సంఘటనలను గుర్తు చేస్తున్నారు. 
 
ముఖ్యగా 2011లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ ఉగ్రవాదులు మన దేశంలో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. ఏకంగా, దేశ పార్లమెంట్‌పైనే దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి అనంతరం వాజ్‌పేయి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించలేదని పలు విమర్శలొచ్చాయి. 
 
కానీ, తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లో భారత ఆర్మీ శిబిరంపై పాక్ ప్రేరేపిత ముష్కర మూకలు దాడి చేశాయి. అలాగే, కాల్పుల విరమణ నిబంధనలను పాక్ ఉల్లంఘించడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడింది. 
 
వీటిని సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు ప్రధాని మోడీ వ్యూహాత్మక సహనం పాటించిన భారత్, బుధవారం అర్థరాత్రి నియంత్రణ రేఖ వెలుపల ఉన్న ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను భారత్ సైన్యం మట్టుబెట్టింది. పాక్ దుశ్చర్యలకు తగు విధంగా బుద్ధి చెప్పే విషయంలో నాటి ప్రధాని అటల్ జీ చేయలేని పనిని, ఇపుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ చేసి చూపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముష్కరుల కోసం భారత వేట ఎలా సాగిందంటే... తొలిసారి ఇస్రో సాయం తీసుకుని...