Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా సెకండ్ వేవ్ పంజా.. ఎమెర్జీని తలపిస్తోంది.. సుప్రీం సీరియస్

Advertiesment
కరోనా సెకండ్ వేవ్ పంజా.. ఎమెర్జీని తలపిస్తోంది.. సుప్రీం సీరియస్
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (13:54 IST)
భారత్‌పై కోవిడ్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. అమెరికా, బ్రెజిల్ కంటే తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటా స్వీకరించింది. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా తయారయిందని.. ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొంటోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
కోవిడ్ మహమ్మారి నియంత్రణకు జాతీయ ప్రణాళిక అవసరమని సీజేఐ జస్టిన్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మానసనం అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. దేశంలో ఆక్సిజన్‌ సరఫరా, రెమిడిసివిర్ వంటి అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌ పద్ధతి, లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. 
 
అందుకే కరోనా అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నట్లు అని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు రేపటిలోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్‌ హరీష్‌ సాల్వేను అమికస్‌ క్యూరీగా సుప్రీంకోర్టు నియమించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి ఉత్తర కొరియా సిద్ధం