Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయి రేప్‌కు గురైందని ఎలా చెప్పగలరు? ఆ రక్తం ఎక్కడ నుంచి వచ్చింది? బీహార్ ఎమ్మెల్యే

బీహార్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రశ్నలేశారు. అమ్మాయి రేప్‌కు గురైందని ఎలా చెప్పగలరు? ఆ రక్తం ఎక్కడ నుంచి వచ్చింది అంటూ నీచమైన ప్రశ్నలు వేసి విసిగించాడు. తానే పోలీసు అవతారం ఎ

Advertiesment
Bihar MLA Wants to Know Where Was the Rape Victim Bleeding From
, బుధవారం, 11 జనవరి 2017 (19:52 IST)
బీహార్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రశ్నలేశారు. అమ్మాయి రేప్‌కు గురైందని ఎలా చెప్పగలరు? ఆ రక్తం ఎక్కడ నుంచి వచ్చింది అంటూ నీచమైన ప్రశ్నలు వేసి విసిగించాడు. తానే పోలీసు అవతారం ఎత్తి ఇంటరాగేషన్ చేపట్టిన ఆయన బీజేపీ మిత్ర పక్షమైన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్‌నే.  బీహార్‌లోని వైశాలీలో ప్రభుత్వ వసతిగృహంలో చదువుకునే ఓ పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె దుస్తులు రక్తంలో తడిసిపోయాయి. 
 
ఈ ఘటన నేపథ్యంలో వసతిగృహానికి వచ్చిన ఎమ్మెల్యే పాశ్వాన్ తానే స్వయంగా మిగిలిన విద్యార్థినులను ప్రశ్నిస్తూ ఇంటరాగేష‌కు పూనుకున్నారు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోయినా.. రేపిస్టు కొంతమంది అమ్మాయిలకు తెలిసివాడై ఉండొచ్చు.. రేపిస్టు మీ గదికే వస్తే మీరేం చేస్తారు అంటూ వికృత ప్రశ్నలు వేశాడు. 
 
అంతటితో ఎమ్మెల్యే ఆగలేదు. ఉపాధ్యాయులవైపు తిరిగి.. ' మీలో కూడా కొంతమంది రేపిస్టుకు సాయం చేసి ఉండొచ్చు కదా?..' అన్నారు. ఈ ఘటనకు  సంబంధించి వీడియో ఒకటి వెలుగు చూడడం దుమారం రేపుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెంపుడు శునకం మరణించిందని.. ఆరో అంతస్థు నుంచి దూకేశాడు..