Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెంపుడు శునకం మరణించిందని.. ఆరో అంతస్థు నుంచి దూకేశాడు..

ప్రాణంగా పెంచుకున్న ఓ శునకం మరణించిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శునకం సామాన్యంగా యజమాని పట్ల విశ్వాసంగా ఉంటే.. ఈ యజమాని.. పెంపుడు శునకంపై అమితమైన విశ్వాసంతో ప్రాణాలను బలితీసుకున్నాడు.

పెంపుడు శునకం మరణించిందని.. ఆరో అంతస్థు నుంచి దూకేశాడు..
, బుధవారం, 11 జనవరి 2017 (19:45 IST)
ప్రాణంగా పెంచుకున్న ఓ శునకం మరణించిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శునకం సామాన్యంగా యజమాని పట్ల విశ్వాసంగా ఉంటే.. ఈ యజమాని.. పెంపుడు శునకంపై అమితమైన విశ్వాసంతో ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఫూణెలో చోటుచేసుకొంది.
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ ఘడ్‌కు చెందిన హర్షవర్థన్ రాఘవ్ అనే యువకుడు పూణెలో మేనేజ్ మెంట్ విద్యను అభ్యసిస్తున్నాడు. రాఘవ్ తండ్రి ఆర్మీలో పనిచేస్తాడు. చిన్నతనం నుండి రాఘవ్ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ శునకంతోనే అధిక సమయం గడిపేవాడు. అలా అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం అనారోగ్యంతో కన్నుమూయడంతో మనస్తాపానికి గురైయ్యాడు. 
 
దీంతో రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఈ మేరకు ఓ లేఖ రాశాడు. ఈ లేఖలో తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టు రాసి పెట్టాడు. తాను ఉంటున్న ఫ్లాట్ లోని ఆరో అంతస్థు నుండి కిందకు దూకాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2 నెలలుగా బాలికలపై అత్యాచారం.. చాక్లెట్ ఆశ చూపి.. లైంగిక వేధింపులు..