Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్యాంబ్లింగ్‌లో ఓడిపోయాడు.. భార్యను తాకట్టు పెట్టాడు.. స్నేహితులతో గడపాలని..?

Advertiesment
గ్యాంబ్లింగ్‌లో ఓడిపోయాడు.. భార్యను తాకట్టు పెట్టాడు.. స్నేహితులతో గడపాలని..?
, మంగళవారం, 15 డిశెంబరు 2020 (11:20 IST)
గ్యాంబ్లింగ్‌లో సర్వం కోల్పోయి చివరికి కట్టుకున్న భార్యను కూడా ఓ భర్త తాకట్టు పెట్టాడు. తన స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేశాడు. నిరాకరించడంతో యాసిడ్ పోసి చిత్ర హింసలకు గురి చేశాడు. బీహార్‌లోని భగల్​పూర్​లో ఈ అమానవీయ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తనపై యాసిడ్​ పోసి దాడి చేశాడని భర్తపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
వైద్య పరీక్షల కోసం మహిళను ఆసుపత్రిలో చేర్పించామని భగల్​పూర్​ ఎస్​ఎస్​పీ ఆశిష్ భార్తీ చెప్పారు. భర్త బలవంతంతో రెండు, మూడుసార్లు స్నేహితులతో గడిపిన మహిళ ఆ తర్వాత తీవ్రంగా నిరాకరించింది. దీంతో ఆమెపై భర్త యాసిడ్​తో దాడి చేశాడు. బాధితురాలు తీవ్ర గాయాలతో ఉందని, ఈ విషయాన్ని దాచేందుకు నిందితులు ఆమెను మొజాహిద్​పూర్​లోని ఓ ఇంట్లో దాచి ఉంచారని పోలీసులు తెలిపారు.
 
బెట్​‌లో ఓడిపోయానని, అందులో భాగంగానే గెలిచిన వారికి తన భార్యను ఓ నెల పాటు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యాయని నిందుతుడైన భర్త చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అయితే రెండు, మూడు సార్ల తర్వాత వెళ్లేందుకు బాధితురాలు తీవ్రంగా నిరాకరించింది. భర్త చెర నుంచి తప్పించుకొని బాధితురాలు లోధిపూర్​లోని తండ్రి ఇంటికి చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కుటుంబ సభ్యులతో మొత్తం విషయం చెప్పిన ఆమె వెంటనే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొజాహిద్​పూర్ పోలీస్ స్టేషన్​కు వెళ్లాలని లోధీపూర్ పోలీసులు చెప్పడంతో అక్కడ ఆమె ఫిర్యాదు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కోటికి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు