ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ట్రెండీగా మారాయి. దీనిపై యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయి. యువత తమ వివరాలు, ఫోటోలు అప్‌లోడ్ చేయడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. డేటింగ్ యాప్స్‌లో వ్యక్తిగత సమాచారం పెట్టడంతో పాటు గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఆన్‌లైన్ డేటింగ్స్ యాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వారితో సన్నిహితంగా మెలగడం వల్ల అనేకమంది మోసపోతున్నారు. కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిల పేరుతో ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అందమైన అబ్బాయిల ఫోటోలను అప్‌లోడ్ చేసి అబ్బాయితో చాటింగ్ చేసి అతని దగ్గరి నుంచి డబ్బు గుంజుతున్నారు కొంతమంది కేటుగాళ్లు.
ఈ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా కొంతమంది తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పోలీసులంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని ఇబ్బందులు గురవుతున్నారంటున్నారు పోలీసులు. ఇలాంటి యాప్స్‌కు దూరంగా ఉండాలంటున్నారు. ఇలాంటి యాప్స్ నిషేధించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.