టీవీ - 9 సీఈనో రవిప్రకాషం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా టీవీ9 వివాదం నడుస్తోంది. ఈ సంస్థలో మెజార్టీ వాటా షేర్లను అలందా మీడియా వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలందా మీడియా కార్యదర్శి కౌశిక్ రావు సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను పదవీచ్యుతుడిని చేశారు.
టీవీ9లో అలందా మీడియా యాజమాన్యానికి 90 శాతంపైగా వాటా ఉంది. అయితే కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డుపడుతూ, తన ఇష్టారాజ్యంగా చానల్ నిర్వహణ జరగాలనే విధంగా రవిప్రకాశ్ వ్యవహరిస్తున్నారని అలందా మీడియా తెలిపింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరితంగా చర్యలకు పాల్పడ్డారని విమర్శించింది. కొన్ని రోజుల క్రితమే టీవీ-9ను అలంద మీడియా టేకోవర్ చేసింది.
ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కౌశిక్ రావు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద పోలీసులకు కేసు నమోదు చేశారు. మరోవైపు రవిప్రకాశ్ కోసం గత రెండు రోజులుగా పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం ఆయన విదేవీ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది.