Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక చేతిలో కత్తి మరో చేతిలో తాళి.. కట్టేయనా? పొడిచేయనా?

Advertiesment
ఒక చేతిలో కత్తి మరో చేతిలో తాళి.. కట్టేయనా? పొడిచేయనా?
, బుధవారం, 15 జులై 2020 (13:28 IST)
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఒక చేతిలో కత్తి మరో చేతిలో తాళి పట్టుకుని ఓ రౌడీ బీభత్సం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని బెంగళూరు, రాజాజీనగర్‌కు చెందిన అభిగౌడ అనే యువకుడు సమీపంలోని ప్రకాష్ నగర్‌లో ఉంటున్న19ఏళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అభి రౌడీ పనులు చేస్తుండడంతో ఆ యువతి అతడిని దూరం పెట్టింది. దీంతో అభి తట్టుకోలేక పోయాడు. 
 
అంతే ఆ యువతిని మాట్లాడాలని రమ్మన్నాడు. గిరి నగర్‌లోని తన స్నేహితుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తాళి పట్టుకుని ఆమె వద్దకు వెళ్ళాడు. తాళి కట్టించుకో, లేదంటే చాకుతో పోడిపించుకో బెదిరించాడు. కానీ, ఆ అమ్మాయి అభిగౌడతో తాళి కట్టించుకోవడానికి నిరాకరించింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన అభి.. ఆ అమ్మాయిని కత్తితో పొడిచేశాడు. ఆమె తీవ్రగాయాలతో మరణించగా దుండగుడు పారిపోయాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు రాజాజీనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైకుపై స్టంట్స్... మందలిచిన వ్యక్తిని 28 సార్లు కత్తితో పొడిచి చంపేసిన కిరాతకులు